రామాలయానికి దూప దీప నైవేద్యo

మంత్రి పువ్వాడ అజయ్ చొరవతో రామాలయానికి దూప దీప నైవేద్య పథకం వర్తింపు

ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లా లా గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధికి ప్రతిన బునారు. ఈ మేరకు స్థానిక నాయకుడు దామా సత్యనారాయణ విజ్ఞప్తితో ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయాన్ని ధూప దీప నైవేద్య పథకం ద్వారా అందించేందుకు కృషి చేశారు. దీంతో మంగళవారం పథకం ఆలయానికి వర్తింప జేస్తు మంత్రి అజయ్ ఆదేశం తో అధికారులు ఉత్తర్వుల జారీ చేశారు. దీంతో ప్రతీ నెలనెలా ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషికి నాయకులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. లాలాపురం ఆలయ అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా మరో సారి మంత్రి పువ్వాడ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking