ఘనంగా పోలీస్ ల సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం.
ఆటపాటలతో దద్దరిల్లిన కార్యక్రమ ప్రాంగణం
దేశభక్తిని చాటిచెప్పిన కళాకారులు.
కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ జాతీయ గీతాలాపన పిలుపుకు, ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది.జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం, సామూహిక జాతీయ గీతలపాన కార్యక్రమము పోలీస్ ఇన్స్పెక్టర్ పి.సైదులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా బాలానగర్ ఏసీపీ గంగారాం పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంగారం మాట్లాతు దేశంలో సమానత్వం గురించి మాట్లాతు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు అలాగే దేశ స్వాతంత్రం పోరాటంలో జరిగిన ఘట్టాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబులు, కానిస్టేబులు, క్రైమ్ సిబ్బంది ఇతర పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు.
కళాకారుల ధూమ్.. దాం..
మా పల్లె శంకర్ అలాగే వారి కల బృందం కలిసి దేశభక్తి పాటలతో సభ ప్రాంగణాన్ని డదరిల్లే ల చేశారు. డప్పుల చప్పుడికి దేశభక్తులు లేసి నృత్యలు వేసే విదంగా దరువులు వాయించారు. కార్యక్రమ ప్రాంగణ చుట్టూ ప్రకల ప్రజలు ఆనందంతో కళాకారులను పోలీసులను చప్పట్లతో ప్రోత్సాహించారు.