జర్నలిస్టులకు ఊరట
కేసిఆర్, కేటిఆర్, అల్లంలకు కృతజ్ఞతలు
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి :
జర్నలిస్టులకు హైదరాబాదులో ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్
లకు తెంజు రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్
కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా నూతన్ కల్ లో విలేఖర్లతో మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్టుల కోసం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.