మత పిచ్చి రెచ్చగొట్టోద్దు
రూ.57 కోట్లతో కలెక్టరేట్
జిల్లా సమీకృత కలేక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన సిఎం కేసిఆర్
* కలెక్టర్ అమోయ్ కుమార్ ను కూర్చీలో కూర్బోబెట్టి ప్ర్రత్యేక పూజలు నిర్వహించిన సిఎం కేసిఆర్
రంగారెడ్డి , అక్షిత ప్రతినిధి : పంటలు పండే
తెలంగాణ కావాలా, కులమతాల పిచ్చితో మండే మంటల తెలంగాణ కావాలా అని
రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కోన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని
కొంగర కలాన్ లో రూ. 58 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని రాష్ర్ట ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి దెబ్బతింటే 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తామని అన్నారు. కులమతాల పేరుతో చిచ్చు పెట్టాలని మతతవ్వ పార్టీల నాయకులు చూస్తున్నారని విమర్శించారు. బిజేపి పార్టీ నాయకుల మాటలు నమ్మద్దని నమ్మితే దారుణంగా మోసపోతామని
అన్నారు. 
ఉద్యమ సమయంలో తెలంగాణలో కరెంటు ఉండదని తప్పుడు ప్రచారం చేశారని భూముల రేట్లు పూర్తిగా పడి పోతాయని ఆంధ్ర పాలకులు ప్రచారం
చేశారని అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ ఉచితంగా అందించిన ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానికే చెందిందని అన్నారు.భూముల రేట్లు వంద రేట్లు పెరిగాయని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నందని టిఆర్ ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. రైతు బంధు పథకంతో
ఎకరానికి రూ. 10వేలు ఇచ్చి అమలు చేసిన ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానికే ఉందని చెప్పారు. ఒక వేళ రైతు చనిపోతే రూ 5లక్షల బీమా రైతు అకౌంట్లలో నేరుగా పడుతాయని తెలిపారు. ప్రపంచంలో ఈ పథకాలు ఎక్కడలేవని కేవలం తెలంగణ రాష్ర్టంలోనే ఈ పథకాలు నడుస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో 7వేల ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు
చేశామని తద్వారా ధాన్యం డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లతోపడుతున్నాయని అన్నారు. పెన్షన్ లు వికలాంగులకు, వితంతులకు , ఒంటరి
మహిళలకు , వృద్దులకు ఉచిత ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానిదేననిఅన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంత గొప్ప వాడు అయితే అన్ని
రాష్ర్టాలలో 24 గంటల విద్యుత్ ఉచితంగా ఎందుకు ఇవ్వడం లేదనివిమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఒరగబెట్టింది ఏమి లేదని అన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని ప్రతి శాసన సభ్యునికి నియోజకవర్గఅభివృద్ది కోసం రూ. 10 కోట్లు ఇస్తానని హమీ ఇచ్చారు. వీటన్నింటిని
అర్థం చేసుకోని ప్రజలంతా టిఆర్ ఎస్ ప్రభుత్వానికి అండదండగాఉండాలని అన్నారు.రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి దూర ప్రాంత
ప్రజలు రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే వారని రాష్ర్టముఖ్యమంత్రి కేసిఆర్ చొరవ వల్ల అన్ని శాఖలు సమీకృతంగా ఒకే భవనంలో ఉండే విధంగా భవన నిర్మాణం చేశారని అది టిఆర్ ఎస్
ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ప్రజలంతా తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న అభివృద్దిని గమనిస్తున్నారని టిఆర్ ఎస్ ప్రభుత్వానికిఅండగా ఉంటానని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టరేట్ భవనానికి 44 ఎకరాలు కేటాయించి రూ. 58 కోట్ల రూపాయలు వెచ్చించి మూడంతస్తుల భవనం వందకు పైగా గదులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లే సాధ్యమైందని అన్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తెలంగాణ
రాష్ర్టన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే అండగా ఉండాలని ఆయన ప్రజలనుకోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్,
రో్డ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, శాసన సభ్యులు సుదీర్ రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, ప్రకాష్ గౌడ్, మహేష్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు టిఆర్ ఎస్ రాష్ర్టనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.