కు.ని ఆపరేషన్ వికటించి…ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటలో ఈ నెల 25వ తేదీ రోజు వివిధ గ్రామాలకు చెందిన 37మంది మహిళలకు డాక్టర్లు కుని అపరేషను చేశారు అందులో నలుగురి మహిళలకు కుని ఆపరేషన్ వైద్యం వికటించి వాంతులు విరోచనలు చేసుకొని మంచాల మండలం లింగం పల్లి గ్రామానికి చెందిన సుష్మ, మాడుగుల మండలనికి చెందిన మమత ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు అన్నారు. ఇంకా ఇద్దరి మహిళల పరిస్థితి కూడా విషమమంగా ఉండటంతో మహిళల కుటుంబ సభ్యులు దుఖ్ఖ సముద్రంలో మునిగి పోయారు. ఇది ముమ్మాటికీ కుని ఆపరేషన్ చేసిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళలకు వైద్యం వికటించి చనిపోయారు తప్ప మహిళలకు ఆరోగ్య పరమైన ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేవు అన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చనిపోయిన మహిళలకు కుని ఆపరేషన్ చేసిన ప్రభుత్వ వైద్యుల పై చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరకుండా చూడాలి వైద్యం చేయించుకుంటున్న ఇద్దరి మహిళకు వైద్యం ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి మరణించిన మహిళల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం అని అన్ని ప్రతిపక్షాల నాయకులు, బాధితుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సాగర్ రహదారి అంబేద్కర్ చౌరస్తా వద్ద దాదాపు 4 గంటలు బెటాయించి ధర్నా చేయడం తో సాగర్ రహదారి మొత్తం ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

*వైద్య సిబ్బంది పైనా దర్యుప్తు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే *.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రమాదానికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అయితే వారిపైన దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్సగ్రేషియా చెక్కులను పంపిణీ చేసిన ఆర్ డి ఓ వెంకటాచారి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, పిల్లల చదువులు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఉందని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking