కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమి.
కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి :
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్ లోని వాటర్ ట్యాంక్ వెనకాల సర్వేనెంబర్ 329/1ప్రభుత్వ స్థలంలో గత కొన్ని రోజులుగా వీఆర్ఏలు సమ్మెలు చేయడంతో ఇదే అదునుగా భావించి కొందరు భూకబ్జాదారులు స్థలాన్ని చదునుచేసి స్తంభాలు వేసి ప్రభుత్వ స్థలంలో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గజం స్థలం కూడా కబ్జా కాకుండా కాపాడాలని పదేపదే హెచ్చరిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోకుండా తమకు ఏమీ తెలియదు అన్నట్టు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తు కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ భూమిని అప్పనంగా కబ్జాదారులకు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుర్వస్థలంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.