లడ్డు ధర… రూ.1,59,999

జై వాసవి ఆర్ జే గ్రూప్

లడ్డు ధర రూ.1,59,999

దక్కించుకున్న ఉమా రవి శంకర్ దంపతులు

భాస్కర్ రామ్ గుప్త ప్రశంసలందుకున్న ఉమా రవి శంకర్ 

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :

హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో జైవాసవి ఆర్ జే గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ప్రతి రోజు భక్తులు అత్యంత భక్తశ్రద్ధలతో నిత్య పూజలు చేశారు. జై వాసవి ఆర్ జే గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ భాస్కర్ రామ్ గుప్త, సుధారాణి దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన లడ్డు వేలం ఆసక్తి దాయకంగా జరిగింది. లడ్డు వేలంను ప్రతిష్టాత్మకంగా భావించిన భక్తులు లడ్డు వేలంలో చాలామంది భాగస్వామ్యులయ్యారు. ఆసక్తి దాయకంగా సాగిన వేలం పాటలో ఉమా రవి శంకర్ దంపతులు రూ.1,59,999ల ధరకు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా జై వాసవి ఆర్ జే గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ భాస్కర్ రామ్ గుప్త మాట్లాడుతూ గణపతి దేవుని ఆశీస్సులతో రవి శంకర్ కుటుంబం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. లడ్డుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరుపడం… వేలంలో భాగస్వామ్యులవడం సంతోషంగా ఉందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking