సంక్షేమ పథకాల పితామహుడు ‘కేసీఆర్’
సీఎం సహాయనిధి పేదలకు వరం
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల పితామహుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కొనియాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) నిరుపేదలకు వరమని అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పట్టణ వ్యాప్తంగా 22 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.7లక్షల 65 వేలు విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, టీఆర్ఎస్ నాయకులు ఖాదర్, బొడ్డు నంద కిషోర్ యాదవ్, మెరుగు సంజయ్, ఆంజనేయ రాజు, గౌటే కనకయ్య, నల్లగంతుల నాగభూషణం, హబీబ్, గంగుల భిక్షం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.