విఘ్నేశ్వరుడి పూజలో భాస్కరుడు

విఘ్నేశ్వరుడి పూజలో భాస్కరుడు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ, ముత్తి రెడ్డికుంటలో మండపాల వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. తగిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వినాయకుడి నిమజ్జనం నిర్వహించాలని గణేష్ ఉత్సవ కమిటీని కోరారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వేలిశెట్టి రామకృష్ణ, కౌన్సిలర్ పత్తిపాటి సంజాత నవాబ్, ఉదయ్ భాస్కర్, వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ రాఘవేందర్, మండల విద్యాధికారి బాలాజీ నాయక్, పట్టణ ఆర్బీఎస్ అధ్యక్షులు లచ్చి రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మన్నెం లింగారెడ్డి, ఘంట శ్రవణ్ రెడ్డి, సక్రం నాయక్, గొంగిడి సైదిరెడ్డి, గజ్జల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking