గుడిలోనే నిమజ్జనం…

గుడిలోనే నిమజ్జనం
కొత్త ఒరవడికి శ్రీకారం

వేద మంత్రోచ్చారణల
నడుమ నిమజ్జనం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించిన పిదప అదే ఆలయ ప్రాంగణంలో నిమజ్జనం చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 11 రకాల ద్రవ్యాలతో తయారు చేసి పూజలందుకున్న గణ నాథుడిని అక్కడే నిమజ్జనం చేసి మొక్కలను నాటారు. వివరాల్లోకి వెళితే…
మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీ కోదండ రామాలయంలో శనివారం వినాయక నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.


ఈ సందర్బంగా మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్
బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వినాయక నిమజ్జనాన్ని దేవాలయంలోనే పూజారుల సమక్షంలో శాస్త్రీయబద్ధంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని రామాలయానికి వచ్చిన భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకునికి అభిషేకించి నిమజ్జనం చేయడం జిల్లాలో మన మిర్యాలగూడ రామాలయంలో మాత్రమే జరుగుతుందని తెలిపారు.

మట్టి విగ్రహాలను గుడులలోనే నిమజ్జనం చేసే ఆనవాయితీకి శ్రీకారం చుట్టిన ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కోదండ రామాలయంలో వినాయక నిమజ్జోత్సవాలకు తరలి వచ్చిన భక్తుల చేతులమీదగా పూజారులు మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. దేవాలయంలోనే మట్టి విగ్రహాలను తీసుకువచ్చి వినాయక నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుని చివరి రోజు ఇలా పాలు పంచదార తేనె నెయ్యి పంచామృతం చందనం విభూది పన్నీరు కుంకుమ పసుపు కొబ్బరి బోండాలు వివిధ రకాల పూలతో అభిషేకం చేసుకొని అందరికీ ఆదర్శంగా ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆలయంలో లడ్డు వేలం పాటను నిర్వహించగా రూ 841116 రూపాయలకు పవన్ ఎలక్ట్రికల్స్ యజమాని తుమ్మల గోవర్ధన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. స్వామివారి పట్టు వస్త్రాలకు నిర్వహించిన వేలంలో మాశెట్టి శ్రీనివాస్ రూ 11116=రూపాయలకు కైవసం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సామాజికవేత్త రంగా శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు పుట్ట దయాకర్ రెడ్డి, బండారు నరసింహ, పండిత్ రెడ్డి, చల్లా కృష్ణ మోహన్, రామ్ రెడ్డి, నామిరెడ్డి రమేష్ రెడ్డి, కిషోర్ రెడ్డి, తుమ్మల గోవర్ధన్ రెడ్డి, కిరణ్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking