ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తా
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు ,అక్షిత ప్రతినిధి :
ఆశీర్వదించండి మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలుపుతానని టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీఎం కేసిఆర్ తోనే తెలంగాణ ప్రగతి సాధ్యమన్నారు.

ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తా అంటూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్, వామపక్షాల బలపరిచిన టిఆర్ఎస్ అభ్యర్థి బుధవారం మునుగోడు మండల పరిధిలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో భాగంగా కొంపెల్లి, చీకటి మామిడి, చోల్లేడు వెలమకన్నె,కచలాపురం, పలివెల ,పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ అభిమానులందరికీ చేతులెత్తి జోడించి అడుగుతున్నాను. నన్ను ఈ సారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను. అని ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించారు. రాజగోపాల్ రెడ్డి అహంకార పూరిత మాటలు మాట్లాడుతూ టిఆర్ఎస్ కార్యకర్తలను మరియు సిపిఐ ,సిపిఎం వామపక్ష పార్టీల నాయకులను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ప్రగల్బాలు పలుకుతున్నాడు అని వాపోయారు. ఈ ప్రచారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,కంచర్ల భూపాల్ రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్,సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సిపిఎం జిల్లా నాయకులు వీరారెడ్డి, నారి ఐలయ్య, నారా బోయిన రవి ముదిరాజ్, వనం లింగయ్య, బంగారు రవి, పూల వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.