అలరించిన శ్రీ రాగా ప్రాజెక్ట్ ఎక్స్పో -2022

శ్రీ రాగా హై స్కూల్ లో ఘనంగా
ప్రాజెక్ట్ ఎక్స్పో -2022

భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి :

కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదరబస్తీ లో గల శ్రీ రాగా హై స్కూల్ లో ప్రాజెక్ట్ ఎక్స్పో -2022 ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిధులుగా పాఠశాల ఛైర్మెన్ మల్లారపు వర ప్రసాద్, డైరెక్టర్ మల్లారపు కవితలు హాజరై ముందుగా కలాంని స్పురిస్తూ పటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్స్ ను తిలకించి వారిని ప్రశ్నించారు.

విద్యార్థుల ప్రాజెక్టులు వారి విజ్ఞానాన్ని అభివృద్ధి పరిచేలా వున్నాయని విద్యార్థులను, ఉపాధ్యాయులను కొనియాడారు. చదువుతో పాటు ఈ విధమైన ఆక్టివిటీస్ నిర్వహిస్తూ పిల్లల్లో టాలెంట్ ని బయటికి తీస్తూ ప్రోత్సహించడం శ్రీ రాగా స్కూల్ కె దక్కుతుందని అన్నారు.

ఈ ప్రాజెక్టులలో వర్కింగ్ మోడల్ , నాన్ వర్కింగ్ మోడల్, డాబాలపై వరి పంటల సాగు, మెడిసినల్ ప్లాంట్స్, చిరు ధాన్యాలు- ప్రాధాన్యత, అగ్ని పర్వతాలు ఎలా వస్తాయి, హైడ్రాలిక్ లిఫ్ట్ పని విధానం, థర్మల్ పవర్ ప్లాంట్ కేటీపీఎస్ మొదలైనవి ఆకట్టుకున్నాయని వారన్నారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్ గా సర్వేశ్వరరావు, సంధ్యలు వ్యవహరించగా జడ్జ్ లుగా ప్రసాద్, సైమన్, రాంబాబులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking