బాలనర్సింహకు డాక్టరేట్

రామన్నపేట అధ్యాపకుడు బాలనర్సింహకు డాక్టరేట్

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట రసాయన శాస్త్ర శాఖాధ్యక్షులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ దొడ్డి బాల నర్సింహకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా.పి.జలపతి పర్యవేక్షణలో ” నైట్రోజన్,ఆక్సిజన్ & సల్ఫర్ విజాతీయ వలయాలు- సంశ్లేషణ” అనే అంశం మీద సమర్పించిన పిహె.డి సిద్ధాంత గ్రంథానికి బాల నర్సింహకు డాక్టరేట్ అవార్డు ఇస్తున్నట్టు 16 న పరీక్షల విభాగం ప్రకటన విడుదలచేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయి పల్లి గ్రామానికి చెందిన బాలనర్సింహ దొడ్డి చిత్తారమ్మ బాలయ్యల ద్వితీయ కుమారుడు‌. విద్య అభివృద్ధి ప్రదాత అని నమ్మిన బాల నర్సింహ పట్టుదలతో చదివి అత్యున్నత పిహెచ్.డి డిగ్రీ పొందారు . ఎపిపిఎస్సీ ద్వారా 2011 లో డిగ్రీ కళాశాల లెక్చరర్ గా ఎంపికైన బాల నర్సింహ యుజిసి నెట్ అర్హత కలిగిన ప్రతిభావంతులు. నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నుండి బదిలీపై వచ్చిన బాలనర్సింహ గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో పనిచేస్తున్నారు. రసాయన శాస్త్ర అధ్యాపకుడిగానే కాకుండా కళాశాల యుజిసి, జిజ్ఞాస విభాగాలకు కో ఆర్డినేటర్ గా విశిష్ట సేవలు అందిస్తున్నారు.గ్రామీణ ఔత్సాహిక విద్యార్థులను రసాయాన శాస్త్ర అధ్యయనంలో ప్రోత్సహిస్తున్న బాల నర్సింహ వెలువరిస్తున్న పరిశోధనా వ్యాసాలు వివిధ జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమవుతున్నాయి. బాలనర్సింహ స్వయం కృషితో డాక్టరేట్ పొందినందుకు కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య ,వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి,  ఏఓ మంజర్ జాఫ్రీ అధ్యాపకులు డా.యాదగిరి, ఇందిర, శ్రీకాంత్, మధు, మక్లా, పి.రమాదేవి, తుల్జాభవాని,ఎస్.రమాదేవి, అనిత, డా.కాంతయ్య, డా.బ్రహ్మం,అమర్, సరిత, బాలరాజు,పూర్వ విద్యార్థుల సంఘం,తల్లదండ్రుల కమిటీ, కళాశాల అభివృద్ధి కమిటీ,కార్యాలయ సిబ్బంది,బొమ్మాయి పల్లి గ్రామస్థులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking