వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు
చేర్యాల, జనవరి 12 అక్షిత న్యూస్: చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని ప్రభుత్వ సిపిఎస్ మరియు జెడ్పి హెచ్ ఎస్ పాఠశాలలో గురువారం సందబోయిన వెంకటేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల సందర్భంగా విద్యార్థులచే ఘనంగా ముగ్గుల పోటీలు పోటీలను నిర్వహించినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు జనగామ శాసనసభ్యులు ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి (టిహెచ్ ఆర్ &ఎంవైఆర్) నామకరంతో స్పోర్ట్స్ ఇటీవల జరగగా,ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందన్నారు.ఈ యొక్క కార్యక్రమం లో పాఠశాలల హెచ్ఎంలు ఐలయ్య, సంధిటి సులోచన,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.