కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు
చేర్యాల,జనవరి 12 అక్షితన్యూస్: కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుండి చేర్యాల పట్టణ కేంద్రంలో ప్రారంభించనున్న సందర్భంగా, గురువారం చేర్యాల ప్రభుత్వ హాస్పిటల్ యందు చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి అధ్యక్షతన కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్, వైద్య అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.