సిపిఐలో పలువురు మహిళల చేరిక
-సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల,జనవరి12 అక్షితన్యూస్: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ అలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు.గురువారం పార్టీ సిద్ధాంతాలు, పోరాటాలకు ఆకర్షితులై చేర్యాల పట్టణానికి చెందిన పొన్నబోయిన మమత, పొన్నబోయిన సిద్దవ్వ, చింతల లక్ష్మీ తో పాటు పలువురు సిపిఐ పార్టీలో చేరారు. వారికి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం అని, వెట్టి చాకిరిని రూపుమాపిన ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. దున్నేవాడికే భూమి కావాలని 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి 4,500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేశారని గుర్తు చేశారు.దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ముందుండి కీలక పాత్ర పోషించిందన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి ఉడుగుల శ్రీనివాస్, సీపీఐ డివిజన్ నాయకులు వలబోజు నర్సింహా చారి, మనేపల్లి కిష్టయ్య, సిద్దిరాం భద్రయ్య, ఎండీ.దావూద్ మియా తదితరులు పాల్గొన్నారు.