
గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి
* ప్రజాప్రతినిధులు, సర్పంచులు ప్రజలతో కలిసి గ్రామాల వికాసానికి పాటుపడాలి
* వైకుంఠ ధామాల్లో సకల సౌకర్యాలు
* చింతపల్లి గ్రామంలో రూ.12లక్షల 60వేల నిధులతో నిర్మించిన వైకుంఠ ధామం ప్రారంభం
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
గ్రామాల సమగ్రాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ప్రజాప్రతినిధులు, సర్పంచులు ప్రజలతో కలిసి గ్రామాల వికాసానికి పాటుపడాలని ఆకాంక్షించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ మండల పరిధిలోని చింతపల్లి గ్రామంలో రూ.12 లక్షల 60వేలు నిధులతో సకల సౌకర్యాలతో నిర్మించిన అధునాతన వైకుంఠ ధామాన్ని భాస్కర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పల్లెల్లో ప్రగతి విప్లవం కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి తో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. రాష్ట్రంలోని పల్లెలు బాగుపడాలనే సంకల్పంతో నాలుగేండ్ల ప్రణాళిక కు సరిపడే విధంగా రూ.39,594 కోట్ల నిధులు కేటాయించారని అన్నారు. వైకుంఠ ధామాల నిర్మాణం కోసం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నుంచి నిధులు కేటాయిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో ఎకరం స్థలాన్ని గుర్తించి నీడనిచ్చే, పూల, పండ్ల మొక్కల పెంపకం చేపడుతున్నామని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, సర్పంచ్ బానావత్ లలిత సక్రు నాయక్, జంకుతండా సర్పంచ్ రవీందర్ నాయక్, ఎంపీటీసీ ధీరావత్ లక్ష్మీ తులసీ రామ్, ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి, రాంరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు పల్లపు వెంకట రాములు, బొడ్డు నందకిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.