
ఫిబ్రవరి 3న కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి
చేర్యాల,జనవరి17 అక్షితన్యూస్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మూడున కలెక్టరేట్ల వద్ద ధర్నాను విజయవంతం చేయాలని, మంగళవారం చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలైన దళితులకే దళిత బంధు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 3న కలెక్టర్ల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది.ఏ ప్రభుత్వ పథకమైన భూమి, ఇల్లు,ఆస్తులు లేని వారికి చేరినప్పుడే ఆ పథకం ప్రయోజనం నెరవేరుతుందని, ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం నిరుపేదలైన దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే ఫిబ్రవరి 14న ఇందిరా పార్క్ వద్ద జరిగే దండోరా మహాధర్నా ను కూడా ఎమ్మార్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో చేర్యాల మండల అధ్యక్షులు భూమిగారి శ్రీరామ్, రామగల్ల కిషోర్, నర్సింలు, పోతుగంటి కిషోర్,సుంచు యాదయ్య, నర్సింగరావు, బిక్షపతి, తిరుపతి,విజయ్, శివ,సాయి తదితరులు పాల్గొన్నారు.