ఖమ్మం/ అక్షిత బ్యూరో :
తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు ఖమ్మం జిల్లా జనరల్ సెక్రెటరీగా ఎస్ ఎస్ గ్రూప్ రియల్ ఎస్టేట్ అధినేత ఏలూరి రాము ను నియమిస్తూ నియమక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నియామక పత్రం అందుకున్న ఏలూరి రాము మాట్లాడుతూ గతంలో తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ ముదిగొండ మండల అధ్యక్షుడుగా ఉన్నాని ప్రస్తుతం తను మామిళ్ళగూడెం ప్రాంతంలో నివాసమని తెలిపారు.యూనియన్ విషయంలో ఏ టైం అయినా అందు బాటు లో ఉంటాను అని తెలిపారు.తన పై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.శక్తి వంచన లేకుండా రియల్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు కృషి చేస్తానన్నాడు.ఈ కార్యక్రమంలో జిల్లా రియల్టర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నం వీరప్రసాద రావు జిల్లా రియల్టర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాటేపల్లి జనార్దన్ రావు జిల్లా రియాల్టర్ అసోసియేషన్ ప్రచార కార్యదర్శి మాతంగి అనిల్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లిక సంతోష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు తుప్పతీ శ్రీనివాసరావు జిల్లా కమిటీ సభ్యులు పాశం నరేష్ రూరల్ మండలం అధ్యక్షులు బిల్లా సతీష్ బాబు ఖమ్మం నగర రియల్టర్ అసోసియేషన్ సభ్యులు ఉస్మాన్ ఖురేషి పాషా తదితరులు పాల్గొని ఏలూరు రాము కు శుభాకాంక్షలు తెలియజేశారు.