మంచిర్యాల నూతన డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన కేకన్ సుదీర్ రాంనాథ్

మంచిర్యాల నూతన డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన కేకన్ సుదీర్ రాంనాథ్

మంచిర్యాల, అక్షిత బ్యూరో: మంచిర్యాల జోన్ నూతన డీసీపీ గా కేకన్ సుధీర్ రాంనాథ్ బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జోన్ కు చెందిన పోలీస్ అధికారులు డీసీపీ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు  ప్రజల అందరి సహకారం అవసరం అని అన్నారు. నేరాలు జరుగకుండా తగు చర్యలు తీసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని అందుకు ప్రజల సహకారం ఉండాలని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులకు తెలియజేయాలని అన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను కొనసాగిస్తామని, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తించదని అన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన డీసీపీని కలిసి పుష్పాగుచ్చాలను అందజేసిన బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్, జైపూర్ ఏసీపీ నరేందర్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking