సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ… పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది శంబీపూర్ కృష్ణ..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ…

పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది శంబీపూర్ కృష్ణ..

మేడ్చల్, అక్షిత బ్యూరో: దుందిగల్  పురపాలక పరది.కి చెందిన 5 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారుల కు రూ.1,54,000/- విలువ చేసే చెక్కులను మేడ్చల్ జిల్లా బీఅర్అస్ పార్టీ అద్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించారు. శనివారం.శంభీపుర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ  లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయం అందిస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని  తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆనంద్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి  పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య నాయకులు కుంటి నాగరాజు మురళి యాదవ్ విష్ణు వర్ధన్ రెడ్డి శామీర్ పేట ప్రకాష్ రావు శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking