
సీపీఐ జనగామ సహాయ కార్యదర్శిగా అందె అశోక్ ఎన్నిక
చేర్యాల,జనవరి 28 అక్షిత ప్రతినిధి: సీపీఐ జనగామ నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా అందె అశోక్ ఎన్నికైనట్లు సీపీఐ జనగామ జిల్లా కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే సీ.హెచ్ రాజారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మంద పవన్ లు ప్రకటించారు.శుక్రవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జనగామ నియోజక వర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశంలో 13మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చేర్యాల ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకుగాను అశోక్ కు మరింత బాధ్యతను అప్పగించినట్లు సిహెచ్ రాజారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ ఎక్కడ ప్రజల సమస్య వస్తే అక్కడ సీపీఐగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం కోసం తమ వంతు కృషి చేస్తానన్నారు.ఈ కమిటీలో కార్యదర్శిగా ఆకుల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా పాతూరి సుగుణమ్మ,సొప్పరి సోమయ్య, మంగళంపల్లి జనార్దన్,ఈరి భూమయ్య,పాతురి ప్రశాంత్, వలబోజు నర్సింహచారి, కుడిక్యాల బాల్ మోహన్,చల్లోజు మల్లేశం, గుంటి కుమారస్వామి,బంటు పాండు ఎన్నికయ్యారు.తమ ఎన్నికకు కృషి చేసిన సీ.హెచ్ రాజారెడ్డి, మంద పవన్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.