
ఇదిగో రెరా
అసత్యాలు వడ్డించొద్దు
ఆర్ జే ప్రతిష్ట దిగజార్చొద్దు
ఆర్ జే గ్రూప్ అధినేత భాస్కర్ రామ్ గుప్త
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అసత్య అక్షరాలు… అభూత కల్పనలు… అవాస్తవాలు… సత్యదూరమైన అక్షరాలు పేర్చి ఆర్ జే ప్రతిష్టను దిగజార్చొద్దు. పారదర్శకతతో… కస్టమర్ల ఉన్నతి, ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని ఆర్ జే గ్రూప్ రియల్ రంగంలో రియల్ బిజినెస్ చేస్తుందని ఆర్ జే గ్రూప్ అధినేత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సిహెచ్ భాస్కర్ రామ్ గుప్త వెల్లడించారు. ఆదివారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ అసత్యాలతో అక్షర రూపం దాల్చి తమ సంస్థ మనుగడ, పురోగతిని అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సర్వే నెంబర్ 153/పిలోజై వాసవీస్ ఆర్ హోమ్స్ తలపెట్టిన ఓఆర్ ఆర్ హైట్స్ నిబంధనలకు అనుగుణంగానే రెరాకు దరఖాస్తు చేసుకోవడం, సమగ్రoగా విచారించిన పిదప తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ టీఎస్ రెరా అనుమతులు పొందడం జరిగిందన్నారు. సెల్లార్, గ్రౌండ్ మరో 5 అంతస్తులు, క్లబ్ హౌస్ లతో కూడిన 13263.14 స్క్వేర్ ఫీట్ ల నిర్మాణానికి పూర్తి అనుమతులు 23 నవంబర్ 2022న టి ఎస్ రేరా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కస్టమర్ల నమ్మకం… భద్రతకు భరోసాగా ఆర్ జే గ్రూప్ “రియల్” వ్యాపారం సాగిస్తోందని చెప్పారు. సంస్థ ఆరంభించిన నాటి నుంచి నేటి వరకు ఫార్మ్ లాండ్స్, డిటిసిపిలతో పాటు నిర్మాణ రంగంలోనూ అదే స్ఫూర్తి, ఒరవడితో పూర్తి స్థాయి పారదర్శకత, జవాబుదారీతనంతో రియల్ రంగంలో విశిష్ఠ సేవలందిస్తున్నామని ఆయన తెలిపారు. అసత్య అక్షరాలతో సత్య దూరమైన కల్పిత కథనాలతో తమ సంస్థను అప్రతిష్ట పాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కస్టమర్ల పెట్టుబడులకు అనుగుణంగా వారి ఉన్నతి, ప్రమాణాలను దృష్ఠిలో ఉంచుకొని తమ సంస్థ పనిచేస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ యువత ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందన్నారు. హెచ్ ఎండిఏ, రెరా తదితర పూర్తి స్థాయి అనుమతులతో కస్టమర్ల శ్రేయస్సుకు అనుగుణంగా తమ సంస్థ సేవలదిస్తుందని, తమ సంస్థ మనుగడ, పురోగతిని అప్రతిష్టను దిగజార్చేoదుకు వారి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసంకుట్ర పూరితంగా కల్పిత కథనాలతో వడ్డించవద్దని హితవు పలికారు. ఇదిగో ఆర్ జే గ్రూప్ పేరిట తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన హెచ్ ఎండిఏ, రెరా సర్టిఫికెట్లుగా ప్రకటించారు.