రాష్ట్ర అభివృద్దే కే సి ఆర్ లక్ష్యం, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డీ యాదగిరి రెడ్డి,
మద్దూరు అక్షిత ప్రతినిధి: జనవరి 30, తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ముఖ్యమంత్రి కే సి ఆర్ లక్ష్యమని జనగామ ఎమ్మేల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.మండలంలోని తోర్నాల గ్రామంలో పది లక్షల రూపాయల సి సి రోడ్ల నిర్మాణంతో పాటుగా పది లక్షల రూపాయల గౌడ కులస్తుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు ముఖ్యఅదితిగా ఎమ్మెల్యే మూత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గోని ఎంపీపీ కృష్ణారెడ్డితో పాటు గ్రామ సర్పంచ్ తాల్లపల్లి రాజమ్మ, మండల ఎంపీటీసీల ఫోరమ్ అద్యక్షులు అకుల యాదగిరి కలిసి శంకుస్థాపనలు చేశారు.అనంతరం దూలిమిట్ట నూతన మండలాన్ని దశలవారీగా అబివృద్ధి చేసుకుందామన్నారు. గత పాలకులు రాష్ట్రన్ని దివాలా తీసి అప్పుల పాలు చేశారని ఎమ్మేల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ నేతలు కేవలం అబివృద్ధి అభివృద్ధి నిరోధకులుగా మారి ముఖ్యమంత్రి కే సి ఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో టి అర్ ఎస్ మండల పార్టీ అద్యక్షులు మంద యాదగిరి, ఉప సర్పంచ్ పర్శారాములు, పి ఎ సి ఎస్ చేర్మేన్ తిరుపతి రెడ్డి,బి ర్ యస్ నాయకులు చోప్పరి సాగర్, దుబ్బుడు వేణుగోపాల్ రెడ్డి, స్వర్గం లక్ష్మయ్య, బర్మ రాజమల్లయ్య, ఇమ్మడి సంజీవరెడ్డి, కర్ర అరుణ, గ్రామ శాఖ అద్యక్షులు గొనేపల్లి మల్లేశం, గౌడ సంఘం నాయకులు దయానందo,కోమురెల్లి,ఉప్పలయ్య,యాదయ్య,ఐలయ్య,మహిళలు, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.