పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిట్యాల

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిట్యాల

అక్షిత ప్రతినిధి: ఆదివారం చిట్యాల మండల ఉరుమడ్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి 1997 -98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిట్యాల సమీపము లోని వివేరా హోటల్ జరిగింది.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు తమ తమ గురువులైన పూర్వ ప్రధానోపాధ్యాయులు ఆర్. లక్ష్మీ నరసింహారావు గారిని పూర్వ ఉపాధ్యాయులు కుకుడాల గోవర్ధన్, కంచనపల్లి నారాయణ, లింగాచారి గార్లను సన్మానించారు స్వాగతోపన్యాసం చేస్తూ ఉరుమడ్ల హైస్కూల్లో 1997- 98 బ్యాచ్ SSC విద్యార్థులు ఈ సమ్మేళనంలో 25 సంవత్సరాల క్రితం విడిపోయి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం లో కలుసుకోవడం ఆనందంగా ఉన్నదని అన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో 55 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని ఆనంద ఉత్సవాలతో తమ బాల్య స్మృతులను పాఠశాలల్లో గడిపిన జ్ఞాపకాలను నెమరు వేసుకొని ప్రతి ఒక్కరూ తమ ఉపన్యాసంలో తమ బయోడేటాను ప్రస్తుతం చేస్తున్న వృత్తిని తన కుటుంబ నేపథ్యాన్ని తమ స్నేహితులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహిళలు 20 మంది పాల్గొన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు పల్లపు బుద్ధుడు ,కుంభం ప్రభాకర్ , సివిల్ అసిస్టెంట్ సర్జన్ డా.నర్సింహ, ఉయ్యాల చంద్రశేఖర్ , ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజినీర్ ఐతరాజు లక్ష్మణ్, పొలగోని నరేష్ ,గోపగోని మహేశ్వరి, ఉయ్యాల సంధ్యారాణి ,సంపూర్ణ ,వసంత అనిత ,మంగమ్మ జక్కలి ఐలయ్య, రాజు ,సుంకరి వెంకన్న, ఉయ్యాల సైదులు, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking