గీత పని వారల సంక్షేమానికి కృషి చేయాలి

గీత పని వారల సంక్షేమానికి కృషి చేయాలి

వరంగల్,అక్షిత బ్యూరో : గీత పనివారల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో చెల్లించాలి. వృత్తి సంఘాల సమాఖ్య  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు.

సోమవారం వరంగల్ శివనగర్ తమ్మెర భవన్ లో గీత పని వారల సంఘం రూపొందించిన క్యాలెండర్ను సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బైరి తిరుపతి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట్రాములు మాట్లాడుతూ గీత పరివారల సంఘ నిర్మాత బొమ్మగాని ధర్మపక్షం పోరాట స్ఫూర్తితో గీత వృత్తి పరిరక్షణకు సమస్యల సాధనకు పోరాడాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, గీత పని వారల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్  బైరి తిరుపతి, గోపా జిల్లా అధ్యక్షులు బైరి లక్ష్మీనారాయణ , ప్రధాన కార్యదర్శి,బి. కుమారస్వామి, గన్నారం రమేష్, పరికరాల రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking