శర వేగంగా నల్గొండ ప్రగతి పనులు కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,స్థానిక శాసన సభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి

శర వేగంగా నల్గొండ ప్రగతి పనులు 

కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,స్థానిక శాసన సభ్యులు 

కంచర్ల భూపాల్ రెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి : నల్గొండ పట్టణం అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా చేపట్టిన రహదారుల విస్తరణ, అభివృద్ధి, మీడియన్, స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు.సోమవారం స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పట్టణం లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు.ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు పట్టణంలో అభివృద్ధి పనులు పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.పట్టణంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి 6 కోట్ల వ్యయంతో చేపట్టిన వరద కాల్వ పనులకు శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డిలు శంఖుస్థాపన చేశారు.2 కోట్ల రూ.ల వ్యయంతో మహిళా ప్రాంగణం నుండి ఔట్ డోర్ స్టేడియం వరకు,2 కోట్ల రూ లతో సాగర్ రోడ్ నుండి గంధం వారి  గూడెం కుంట వరకు,2 కోట్ల రూ.లతో

ఎల్.ఎస్.గుట్ట నుండి బక్క తాయి కుంట వరకు చేపట్టిన వరద కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం తొలుత మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మించనున్న ఫ్లై ఓవర్ పై అర్&బి అధికారులతో చర్చించి సూచనలు చేశారు.మర్రిగూడ బైపాస్ నుండి క్లాక్ టవర్ వరకు రహదారి అభివృద్ధి పనులు, మీడియన్,ఫుట్ పాత్ పనులు పరిశీలించారు.హైద్రాబాద్ రోడ్ మానస విహార్ వద్ద మురుగు నీరు పోయేందుకు డ్రైన్ నిర్మాణం చేయాలని స్థానికులు కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డిలు తెలిపారు. ఐ.టి.టవర్ నిర్మాణ పనులు,

సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించారు సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఎలివేషన్ పనులు పై సూచనలు చేశారు.ఎన్.జి.కళాశాల నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాలు,సూచనలు మేరకు,రాష్ట్ర పురపాలక,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావు చొరవ,జిల్లా మంత్రి జి.జగదీష్ రెడ్డి సహకారం తో పట్టణం లో సుమారు 1400 కోట్ల వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు కళాభారతి నిర్మాణం,ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, శిల్పారామం,వల్లన రావు చెరువు అభివృద్ధి పనులు,మెడికల్ కళాశాల పనులు చేపట్టినట్లు తెలిపారు.మార్చి లోగా రహదారి అభివృద్ధి,

విస్తరణ పనులు, ప్రారంభం

కళాభారతి, ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ పనులకు రాష్ట్ర పురపాలక మంత్రి కె టి.అర్ ద్వారా శంకుస్థాపన చేసే దిశగా పనులు కొన సాగుతున్నట్లు తెలిపారు. యు.జి.డి పనులు 56 కోట్లతో చేపట్టిన పనులలో గ్యాప్ మాన్యువల్ టు మాన్యువల్ గా చేపట్టి ఔట్ లేట్ లతో కలుపుతున్నట్లు,త్వరలో 216 కోట్లతో యు.జి.డి పనులు చేపట్టి రెండు సంవత్సరంలలో పూర్తి చేస్తామని,మిగతా పనులు సంవత్సరంన్నరలో పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యం.సైధి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి,వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్ లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking