ఆర్డీవో పనితీరు బాగోలేదు * బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

ఆర్డీవో పనితీరు బాగోలేదు

* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి: కొత్తగూడెం ఆర్ డీ ఓ పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఆర్డీవో పై చర్యలు తీసుకోవాలని చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కి పిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారిగా స్వర్ణలత బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ మండలాల్లో ఏజెన్సీ నిబంధనలకు వ్యతిరేకంగా, పంచాయతీ రాజ్ చట్టాలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా భూబదలాయింపు చేసి పరోక్షంగా వెంచర్లు వేసిన వారికి సహకరించే విధంగా వ్యవహారించిన ఆర్డిఓపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వారు చేసిన భూబదలాయింపులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని పిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, అల్లకొండ శరత్, పాల్వంచ మండల అధ్యక్షుడు జెట్టి ఆనందరావు, నాగుల రవికుమార్, వంగా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking