ఘనంగా షాహిద్ దివాస్
స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ నివాళులు అర్పించిన ఎస్పి గౌస్ ఆలం
ములుగు,అక్షిత బ్యూరో: జనవరి 30 1948 లో హత్యకు గురైన మహాత్మా గాంధీ మరణానికి గుర్తుగా షాహిద్ దివాస్ ను జరుపుకుంటారు.ఈ సందర్బంగా ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన ఎస్పీ గౌష్ ఆలం మరియు అధికారులు,సిబ్బంది మౌనం పాటించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరినీ స్మరించుకునే రోజుగా ఈ రోజున పాటిస్తారని,ఈ రోజును అహింస మరియు శాంతి దినంగా పాటిస్తారని,దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారందరినీ దేశం స్మరించుకోవాల్సిన,గౌరవించుకోవాల్సిన భాద్యత మనందరి మీద ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పి బోగోని సదానందం,డి.ఎస్పి సుభాష్ బాబు,ఆర్.ఐ రాధారపు స్వామి,సిఐ సార్ల రాజు,ఎస్ఐ కమలాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.