రెండోవ విడుత కంటి వెలుగును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి.మహేందర్ గౌడ్

రెండోవ విడుత కంటి వెలుగును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి.మహేందర్ గౌడ్

రాజేంద్రనగర్,అక్షితప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మంచి సత్ఫలితాలను కల్పిస్తుందని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ అన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ 2వార్డు లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన
కంటి వెలుగు కేంద్రాన్ని మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ తో పాటు కార్పొరేటర్ పద్మావతి పాండు
మేయర్ సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … కంటిచూపు సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు, శాస్త్ర చికిత్సలు, కంటి అద్దాల పంపిణీ, ఆపరేషన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా జరిపిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కంటి వెలుగు కేంద్రంలోని పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు,ప్రజలకు మౌలిక వసతులను కల్పించామన్నారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి ఎలాంటి ఇబ్బందులు వున్న మా దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కరిస్తామన్నారు. కంటి వెలుగు మహా అద్భుతమైన పథకం అని అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking