తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలే దేశానికి ఆదర్శం _ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలే దేశానికి ఆదర్శం

_ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

చేర్యాల,జనవరి 30 అక్షిత ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేర్గు గ్రామంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పర్యటించి నూతనంగా నిర్మించనున్న 33/11కే.వి సబ్ స్టేషన్ పనులకు భూమిపూజ చేసి, గ్రామంలోని రైతు వేదిక నూతన భవనాన్ని  ప్రారంభించారు. అనంతరం చేర్యాల మండల ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి/ షాదీ ముబారక్ 48 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సబండ వర్గాలకు పెద్దపీట వేస్తోందని అందులో భాగంగా రైతులకు కరెంటు కష్టాలు ఉండకూడదని, ఈ రోజు చేర్యాల మండలంలోని  కడవేర్గు గ్రామంలో కోటి యాభై లక్షలతో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు.

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి,కళ్యాణ్ లక్ష్మి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం1లక్ష116 రూ” చొప్పున ఆర్థిక సహాయంగా అందిస్తుందని, ఇప్పటివరకు1800 కుటుంబాలకు, 1900 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.ఇన్ని సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, దీనిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బిజెపి,కాంగ్రెస్ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.నేడు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని,రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశంలో అమలు చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ  ఉల్లంపల్లి కరుణాకర్,మున్సిపల్ చైర్ పర్సన్ ఏ స్వరూప రాణి, తాసిల్దార్ ఎస్ కే ఆరీఫా,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్యాల బాల నరసయ్య,కౌన్సిలర్లు,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పి ఎల్లారెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతల మల్లేశం,కో ఆప్షన్ సభ్యులు,బిఆర్ఎస్ నాయకులు ఏ శ్రీధర్ రెడ్డి, ఎం కిష్టయ్య,ఎస్ అంజయ్య,యాట బిక్షపతి,సిహెచ్ పరశురాములు,వై యాదగిరి,తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking