ఇందిరమ్మ కాలనీలో సొంత నిధులతో బోర్ వేయించిన 22వ వార్డు కౌన్సిలర్ సంధ్య హనుమంత్ రావు..
కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ 22వ వార్డు లో ఇందిరమ్మ కాలనీలో స్థానిక ప్రజలు నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నామని.. 22వ వార్డు కౌన్సిలర్ సంధ్య హనుమంత్ రావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన. కౌన్సిలర్ సొంత నిధులతో బోర్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంధ్య హనుమంతరావు మాట్లాడుతూ 22వ వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాలని అన్నారు అలాగే ఎల్లప్పుడూ నిత్యం ప్రజల కోసం ప్రజల వైపే ఉంటామని ప్రజలకు ఏ ఆపద వచ్చిన నేను అండగా ఉంటామని నిత్యం ప్రజల కోసం సేవ చేస్తూ ముందుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలిపారు.