ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా దోరేపల్లి శ్వేత -రేపు ప్రమాణ స్వీకారం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా దోరేపల్లి శ్వేత

-రేపు ప్రమాణ స్వీకారం

ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ గా ఖమ్మం నగరానికి చెందిన కార్పోరేటర్ డాక్టర్ దోరేపల్లి శ్వేత నియమితులయ్యారు.
ఖమ్మం మార్కెట్ చైర్మన్ గా బీసీ సామాజీక వర్గానికి చెందిన దోరేపల్లి శ్వేత వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినా డాక్టరేట్ కోర్స్( బిడిఎస్) చదివినా రాజకీయంలో మాస్ పాలోయింగ్ సంపాదించారు. ఖమ్మం నగరంలో రెండు సార్లు కార్పొరేటర్ గా గెలుపొందారు. ఫిబ్రవరి 1న
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ల సమక్షంలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు

-దోరేపల్లి శ్వేత

ఖమ్మం నగరంలో రెండు సార్లు కార్పోరేటర్ గా విజయం సాదించిన నాకు అత్యంత భాధ్యత గల ఖమ్మం వ్యవసాయ మార్కేట్ చైర్మన్ గా భాధ్యతలు అప్పగించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు. నాకు రైతులకు సేవలందించే అవకాశంతో పాటు నాకు భాధ్యతలు పెరిగాయి.రైతుల సంక్షేమం కోసం మార్కెట్ అభివృద్ది కోసం నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking