సింగరేణి నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ

సింగరేణి నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ

మందమర్రి, అక్షిత ప్రతినిధి: మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని ఆవరణలో సోమవారం కార్మికులు, అధికారుల అధ్వర్యంలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సింగరేణి క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ కార్మికులకు సంక్షేమం కోసం పాటుపడుతుండని, రక్షణతో కూడిన ఉత్పత్తినే కోరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి పి రాజు, గ్రూప్ ఇంజనీర్ బసవరాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, బీఎం ఇంచార్జి ముస్తఫా, ఇంజనీర్లు సైదులు, రాంసాగర్, ప్రవీణ్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసి పిట్ కార్యదర్శి తిరుపతి గౌడ్, గని ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking