
అక్షిత అక్షరం….జనపక్షం
రాజా ఇన్ ఫ్రా సీఎండి రాజు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అక్షిత అక్షరం… జనపక్షంగా వర్ధిల్లుతుందని రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని తార్నాక ప్రధాన కార్యాలయంలో అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగితో కలిసి అక్షిత నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తోందన్నారు. అక్షిత అక్షరం… ప్రజాయుధంగా పరిడ విల్లుతుందన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ అక్షిత అక్షర శంఖారావం మోగిస్తూ ప్రజా సమస్యల సాధనకు కృషి చేస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ల సారధ్యంలో పత్రిక ఎన్నో సామాజిక అంశాలకు తోడుగా మానవీయ, పరిశోధనాత్మక కథనాలను వెలుగులోకి తెస్తూ పరిష్కారానికి చొరవ చూపుతుందని ఆయన తెలిపారు. మరింత నిత్య నూతనత్వంతో మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. దశాబ్దంన్నర కాలంగా అక్షిత అక్షర సమరం సాగిస్తుందన్నారు. అక్షిత దిన దిన ప్రవర్ధమానంగా అక్షిత అక్షరం ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా వెలుగొందుతుందన్నారు. పత్రికలు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాయన్నారు. నిష్పక్షపాత వార్తలను రాస్తూ సమాజాన్ని మేల్కొల్పేందుకు కృషి చేయాలని అన్నారు.నిజాలను నిర్భయంగా సమాజం ముందు ఉంచుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తున్నటువంటి అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక లాంటి పత్రికలు సమాజం మేలుకొలుపు కోసం పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్( సేల్స్ ) కీర్తన రెడ్డి, రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్( మార్కెటింగ్ ) కళ్యాణ్,
భాను,బాలరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.