
ప్రభుత్వ బడులకు మహర్దశ
*కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు*
*మన ఊరు మనబడి.. మన బస్తి మనబడి పథకంతో పాఠశాలలు బలోపేతం*
*పేదలకు విద్యా , వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం*
*దశలవారీగా అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ టౌన్, అక్షిత న్యూస్ :
మన ఊరు మనబడి,మనబడి మన బస్తి పథకంతో తెలంగాణ ప్రభుత్వం సర్కారీ పాఠశాలలకు మహర్దశ తెచ్చిందని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని 9వ వార్డు సాలార్జంగ్ పేటలో మన బస్తీ మనబడి పథకం కింద ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన మౌలిక సదుపాయాలను, అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశాయన్నారు. పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొని మన ఊరు- మనబడి, మనబస్తీ -మనబడి పథకంతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారన్నారు.

లక్షల రూపాయల వ్యయంతో పాఠశాలల్లో బాల బాలికలకు మరుగుదొడ్లు, వంటశాలలు విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు పాఠశాల ప్రహరీ గోడలు ఆటస్థలం వంట గదిలో భోజనశాలలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్ ఇలా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తొలి దశలో మండలానికి రెండు చొప్పున పాఠశాలలకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేశారని ప్రాధాన్యత క్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు. గ్రామాల్లో విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీష్ మీడియం విద్య నేడు పేద ప్రజలు అందరికీ అందుతుందన్నారు. బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఇలా గురుకుల పాఠశాలలు పెట్టి నాణ్యమైన విద్యతోపాటు కల్పించి వేలాదిమంది విద్యార్థులను ఉన్నత లక్ష్యాలు చేరుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానిక కౌన్సిలర్ షేక్ మదర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రచ్చ మురళి, ఎస్ఎంసి చైర్మన్ స్థానిక నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రాధారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, మండల విద్యాశాఖ అధికారి సలీం షరీఫ్, కో ఆప్షన్ సభ్యులు సాదిక్, పట్టణ కౌన్సిలర్లు కోట మధుసూదన్, కల్లూరి పద్మజ, మేధారు లలిత,ఎస్ఎంసి చైర్మన్ సబీనా బేగం,టిఆర్ఎస్ నాయకులు, అధికారులు,పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.