ఘనంగా భీష్మ పితామహుడి జయంతి ఏకాదశి ఉత్సవం
చేర్యాల,ఫిబ్రవరి 01అక్షిత న్యూస్: నేటి సమాజానికి ఎప్పుడో తన జీవితమే ఒక వికాస మార్గం అని, ఆచరణాత్మకంగా చూపిన తాను కోరుకున్నప్పుడే మరణం రావాలని,స్వచ్ఛంద మరణం వరంపొందిన ఆ జన్మ బ్రహ్మచారి అకుంటిత దీక్షాపరుడు,కర్తవ్య పాలకుడు బాధ్యతాయుత దీక్షాదారుడు అయినా కురువృద్ధ పితామహుడు భీష్మ పితామహు డి జయంతి ఏకాదశి ఉత్సవం, కలియుగంలో ప్రజలంతా కూడా తరించడానికి తరు నోపాయంగా శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణము అని జగతికి అందించిన శుభదినం ను చేర్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో అశేష భక్తుల అచంచలమైన భక్తి ప్రపత్తులతో భీష్మ ఏకాదశి నీ ఘనంగా నిర్వహించారు.భీష్ముడు మరణించాక వచ్చిన ఏకాదశి కాబట్టి దీనిని భీష్మ ఏకాదశి అంటారు.బ్రతికినంత కాలం నలుగురికి ఉపయోగపడే విధంగా బ్రతికిన భీష్ముడి ఆదర్శాన్ని అందరూ పాటించాలని,కర్తవ్య నిర్వహణలో ఎప్పుడూ ఉండాలని కష్టాల్లో కూడా చెలించకూడదని జగతికి ఇచ్చిన సందేశాన్ని రాజు స్వామి వివరించగా, ప్రధానార్చకులు శేషాచార్యులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రతికిన చచ్చిన అందరికీ సేవలు చేసే చెట్టును లేదా వృక్షాన్ని చూసి నేర్చుకోవాలని,దాని గుర్తుగా దేవాలయంలో భక్తులు అందరికీ ఉపయోగపడే మొక్కలను నాటి తమ భక్తి సేవలను స్వామి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో భక్తులు సరోజినీ,మానస,లక్ష్మి, వనిత, ఆండాలు, లలిత,అనురాధా, అన్నపూర్ణ, పద్మ,సరిత,కళావతి, సుశీల,కమల మరియు బిఆర్ఎస్ మండల అధ్యక్షురాలు మీస పార్వతితదితరులు పాల్గొన్నారు.
.