
ప్రజా సమస్యల సాధన కోసం ముందుకు సాగాలి
– సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్
చేర్యాల,ఫిబ్రవరి 01అక్షిత న్యూస్: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో బుధవారం సిపిఐ గ్రామ కార్యదర్శి కేశవరెడ్డి బాల్రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా,ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ హాజరై ముత్యాల గ్రామానికి చెందిన కేశిరెడ్డి సురేందర్ రెడ్డి, చింతల బాబు తోపాటు పలువురిని సిపిఐ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో దున్నేవాడికే భూమి కావాలని ఆనాడు సాగిన తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంచి 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారన్నారు.వారి స్ఫూర్తితో ముస్త్యాల గ్రామంలో నాటి సిపిఐ నేతలు కేసిరెడ్డి కృష్ణారెడ్డి, యాడారం మల్లయ్య నేతృత్వంలో దున్నేవాడికే భూమి కావాలని భూమి లేని నిరుపేదలను ఏకం చేసి సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు.ప్రజా సమస్యల సాధన కోసం ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గూడెపు సుదర్శన్,నాయకులు బాలయ్య,పెంటయ్య,రాములు, కిష్టయ్య,స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.