ఎస్సెస్సి 1995-96 బ్యాచ్ మిత్రుల ఆర్థిక సహాయం
ఆప్త మిత్రుడి కుటుంబానికి చేయూత
వేములపల్లి, అక్షిత ప్రతినిధి : ఆప్త మిత్రుడి కుటుంబానికి కలిసి చదువుకున్న సహచర మిత్రులు కాసింత అండగా నిలిచారు. ఆకస్మికంగా తనువు చాలించిన ఆప్త మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత కల్పించారు. అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించిన మిత్రుడు దైద రామయ్య కుటుంబ సభ్యులకు వేములపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ వరకు కలిసి చదువుకున్న 1995-96 బ్యాచ్ విద్యార్థులు ముప్పై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.
*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేములపల్లిలో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న మిత్రుడు దైద రామయ్య అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించగా విషయం తెలుసుకున్న SSC 1995-96 బ్యాచ్ మిత్రులు మరణించిన మిత్రుని కుంటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని భావించి అందరూ కలిసి 35000 రూపాయలు సేకరించి రామయ్య భార్య పారిజాతకు అందచేయడం జరిగింది.అతే కాకుండా బీటెక్ చదువుతున్న రామయ్య ఇద్దరు కుమారులకు భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా కల్పించారు.