*గుత్తా యువసేన ఆధ్వర్యంలో మండలి చైర్మన్ జన్మదిన వేడుకలు
చిట్యాల, అక్షిత ప్రతినిధి :
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదినం సందర్బంగా చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన వేడుకలో గుత్త వెంకట్ రెడ్డి ట్రస్టు చైర్మన్ శ్రీ గుత్త అమిత్ రెడ్డి సమక్షంలో గుత్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుంకరి యాదగిరి ధనమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, BRS మండల పార్టీ అధ్యక్షులు ఆవుల అయిలయ్య యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, గుత్త యువసేన జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్ లు,పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి ఉప్పల్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జిట్టా చంద్రకాంత్,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.