గాంధీ కలలకు కేసిఆర్ తోనే సాకారం

గాంధీ కలలకు
కేసిఆర్ తోనే సాకారం

వేములపల్లి మండలంలో రూ.1కోటి 80 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మిర్యాలగూడ ఎమ్మెల్యే
నల్లమోతు భాస్కర్ రావు

అక్షిత ప్రతినిధి, వేములపల్లి : జాతి పిత మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యం కలను సాకరం చేసిన ఘనత నాటి తెలంగాణ ఉద్యమనేత, నేటి బంగారు తెలంగాణ నిర్మాత రేపటి భారతదేశ భవిష్యత్ నేత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శనివారం వేములపల్లి మండలము అమనగల్లు గ్రామంలో ఆలయ అభవృద్ధి కమిటీ చైర్మన్ ఎల్గపల్లి వెంకటేష్ లక్ష్మిల అధ్వర్యంలో దాతల సహకారంతో నిర్మించిన శ్రీశ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి ఆలయ ముఖద్వారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీదేవిగూడెం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతి భవననిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.15 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.రావులపెంట గ్రామంలో సిడిపి నిధులు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన నల్లగొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘం భవనము మదర్ డైరీని ప్రారంభించారు.గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.25లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సల్కునూరు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మాణం చేయనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మంగాపురం గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీాభివృద్ధి పథకం నిధులు రూ.15 లక్షల వ్యయంతో గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ-వెంకటయ్య,వైస్ ఎంపిపి పాదూరు గోవర్ధని, బిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సల్కునూరు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డి, పంచాయితీ రాజ్ డిఈ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ అజ్మీరా దేవిక, పిఆర్ఎఈ చిల్లంచర్ల ఆదినారాయణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, పేరాల కృపాకర్ రావు, లింగారావు సర్పంచులు చిర్ర మల్లయ్య యాదవ్, వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్ చెర్కుపల్లి కృష్ణవేణి సుమన్, దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి,అంకెపాక రాజు, సాయిని సైదులు,ఎంపీటీసీలు మేక లలితరవి, నంద్యాల శ్రీరాంరెడ్డి, గడ్డం రాములమ్మ వెంకన్నయాదవ్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోలా పాపయ్య, పేరాల సుధాకర్ రావు, చంద్రయ్య, గడ్డం కృష్ణ, మద్దిరాల ప్రతాప్ రెడ్డి చింతకాయల వీరేందర్, దేవరాజ్ వెంకన్న, శ్రీను తదతరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking