మిర్యాలగూడ పట్టణంలో బిజెపిని‌ పటిష్ఠపర్చాలి *బిజెపి పాలక్ కవిత

మిర్యాలగూడ పట్టణంలో
బిజెపిని‌ పటిష్ఠపర్చాలి

*బిజెపి పాలక్ కవిత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ పట్టణంలో. బిజెపిని పటిష్టపర్చాలని మిర్యాలగూడ నియోజకవర్గంలో బిజెపిని పటిష్టం పర్చాలని ముఖ్య అతిధి మిర్యాలగూడ బిజెపి పాలక్, సినీ నటి డి.కవిత శనివారం పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న మున్సిపాలిటీ సమస్యలపై, వార్డులలో డ్రైనేజీ, శానిటేషన్, మంచి నీరు, వీధిణలైట్ల, రోడ్ల బాగు కొరకు పార్టీ పరంగా ప్రజలను చైతన్య పరచాలని ఆరోగ్య మిర్యాలగూడ చేసే బాధ్యతను బిజెపి కార్యకర్తలు ముందుండి పోరాటం చేసి ప్రజల దగ్గరకు పోవాలని, 48 వార్డులలో ఇంటి ఇంటి వెళ్లి సమస్యలను తెలుసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమం లో అసెంబ్లీ ప్రభారీ గోగిరెడ్డీ లచ్చిరెడ్డి, సాధినేని శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శిలు దొండపాటి వెంకట్ రెడ్డి, చిలుకూరి శ్యామ్, బంటు గిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, రేపాల పురుషోత్తంరెడ్డి, బి.రతన్ సింగ్, కొండేటి సరిత, కె.వేణు, అశోక్ రెడ్డి, రాంచంద్రారెడ్డి, బాషా, మణిలాల్, రాజిరెడ్డి, యాదగిరి, శేఖర్, విద్యాసాగర్, అంతయ్యలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking