ప్రజా  ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు 

ప్రజా  ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ప్రజా  ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా  సత్వరమే పరిష్కరించాలని  అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో నిర్వహించిన  ప్రజావాణి   కార్యక్రమం లో జిల్లాలో వివిధ ప్రాంతాల  నుండి పిర్యాదు దారులు  44 పిర్యాదులు  సమర్పించారని, వాటిలో  ధరణికి   సంబంధించిన భూ  సమస్యలపై,ఆసరా  పెన్షన్లు, పంచాయతీలకు సంబంధించినవి,ఎస్.సి.కార్పొరేషన్,ఇతర శాఖల సమస్యలకు సంబంధించి  దరఖాస్తులు  వచ్చినట్లు తెలిపారు.  వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు  హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో మోతి లాల్ ,  జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking