సిసి రోడ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా

సిసి రోడ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా

నల్గొండ, అక్షిత ప్రతినిధి : జిల్లాలో పరిపాలన అనుమతి మంజూరు చేసిన అన్ని సి.సి.రోడ్లు వెంటనే గ్రౌండింగ్ చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ రాజ్ ఏ.ఈ. లు అదనపు ప్రోగ్రాం అధికారులతో వీడియో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి లేబర్ మొబిలైజేషన్, నర్సరీలు, స్వచ్చ భారత్ మిషన్, ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్,సోషల్ ఆడిట్ రికవరీస్, తెలంగాణ క్రీడా ప్రాంగణం, తెలంగాణకు హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు, సి.సి.రోడ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించినారు. .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ప్రతి గ్రామపంచాయతీలో 25 మంది కూలీలు ఉపాధి హామీ పనికి వచ్చేలా తగు చర్యలు గైకొనాలని ఆదేశించారు.

తెలంగాణ క్రీడా ప్రాంగణంలకు మిగిలిన అన్ని గ్రామ పంచాయతీలలో భూములు గుర్తించాలని ఆదేశించారు. భూములు లభించిన చోట వెంటనే పూర్తి చేయాలని అన్నారు
బృహత్ పల్లె ప్రకృతి వనాలకు కూడామిగిలిన అన్ని గ్రామ పంచాయతీలలో భూములు గుర్తించాలని అన్నారు.
సోషల్ ఆడిట్ కు సంబంధించిన జరిమానాలను క్షేత్ర స్థాయి సిబ్బంది నుండి రికవరీ చేయాలని సూచించారు.
జిల్లాలో అన్ని నర్సరీలలో 100% జర్మినేషన్ వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వేసవి కాలం వస్తున్నందున అన్ని నర్సరీలలో షేడ్ నెట్ అమర్చాలని ఆదేశించారు.
నర్సరీలలో మొక్కలు ఏపుగా పెరగటానికి జీవామృతం తయారు చేసి మొక్కలకు పిచికారీ చేయాలన్నారు.
వచ్చే వారం రోజుల్లో 50% ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్స్ వసూలు చేసి ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి కాళిందిని,, జిల్లా పంచాయత్ అధికారి విష్ణు వర్ధన్,,పంచాయతీ రాజ్ ఈ.ఈ.తిరుపతయ్య, సహాయక పథక సంచాలకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking