ఆరోగ్య మేళాను సద్వినియోగం చేసుకోవాలి వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్

ఆరోగ్య మేళాను
సద్వినియోగం చేసుకోవాలి

వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆరోగ్యమేళా ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తుందని ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామన్నపేట వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్ అన్నారు. మంగళవారం
రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో ఆరోగ్యమేళాను ఆయన ప్రారంభించి అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్యమేళాలో భాగంగా ఉచిత వైద్య పరీక్షలు చేయడం, మందులు అందించడం, ఆరోగ్య గుర్తింపు నంబరు కేటాయించడం జరుగుతుందన్నారు.

చెవి, ముక్కు, గొంతు, కంటి వైద్య నిపుణులు సేవలు అందిస్తారని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత,ప్రజలు వ్యాయామం చేయాలని రోజుకు కనీసం అరగంట నడక లేదా సైకిల్ తొక్కడం వల్ల బిపి,షుగర్ లాంటి జబ్బులు దరిచేరవని,వ్యాయామం వల్ల మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ ప్రోగ్రాం ఆఫీసర్ మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొబ్బిలి బుచ్చిరెడ్డి, ఏ.ఎన్.ఎం రమణ, పాఠశాల ఉపాద్యాయులు స్వరూప రాణి, రవికిరణ్, సత్తయ్య, ఆశా కార్యకర్తలు ఏభూషి ఉప్పలమ్మ, సుర్వి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking