అభివృద్ధికి కేరాఫ్ బిఎన్ రెడ్డి నగర్ మొద్దు లచ్చిరెడ్డి

అభివృద్ధికి కేరాఫ్ బిఎన్ రెడ్డి నగర్

మొద్దు లచ్చిరెడ్డి

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి : ఎల్బీనగర్ నియోజక వర్గ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ ను
ఎల్బీనగర్ ఎంఎల్ ఏ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలుపుతున్నట్లు కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం బిఎన్ రెడ్డి పరిధిలోని పలు కాలనీలకు రూ.6 కోట్ల 73 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్సీ కోడ్ దృష్ట్యా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అభివృద్ధి ఆగకూడదు అనే ఉద్దేశంతో స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘాలతో శంకుస్థాపన చేయించారు.

దానిలో భాగంగా సిబిఐ అనంత వేణి నగర్ కాలనీలో యుజిడి లైన్ పనులకు శంకుస్థాపన లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. సాహెబ్ నగర్ వీకర్ సెక్షన్ లో సిసి రోడ్లు, విజయపురి ఫేస్ -2, కాలనీలో జిహెచ్ఎంసి పార్క్, గాంధీనగర్ , హరిహర పురం కాలనీకు సిసి రోడ్లు శంకుస్థాపన చేశారు.బి.యన్ రెడ్డి నగర్ ఫేస్ -3, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ ఫేస్ -1 ,చైతన్య నగర్ సిసి బిటి రోడ్లు, పంచాయతీరాజ్ టీచర్స్ కాలనీకి ఫేస్ -1,నార్తులకు బీటీ రోడ్లు సిసి రోడ్లు శంకుస్థాపన. పంచాయతీరాజ్ టీచర్స్ కాలనీ ఫేస్ 1, సౌత్ పార్ట్, హెచ్.ఎం.డి పార్క్, సి .సి రోడ్లు బిటి రోడ్లకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్లోని బారాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking