పద్మశాలి సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలి

పద్మశాలి సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలి

కోదాడ టౌన్ అక్షిత న్యూస్:
కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ఈరోజు మంగళవారం పద్మశాలి సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి ఇట్టి కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు నక్కా చంద్రం సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పరచుకున్నారు జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ నూతన బాడీ తో పాటు కులస్తులు కలిసి సంఘం అభివృద్ధికి అన్నివేళలా కృషి చేయాలన్నారు నూతన బాడీ అందరికీ అందుబాటులో ఉండి సంఘాన్ని ముందుకు నడుపుతూ మంచి పేరు సంపాదించాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు దేవర శెట్టి శ్రీనివాసరావు వనం వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా పున్నా సత్యనారాయణ కోశాధికారిగా పొడుగు సీతారాములు మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉండి సంఘం బలపేతానికి అన్నివేళలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నక్క చంద్రం మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking