సమతకు పరామర్శ

దేవాదాయ శాఖలో అధికారి సమతను పరామర్శించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం దేవాదాయ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమత ని వారి స్వగృహంలో పరామర్శించిన ఐక్యవేదిక నాయకులు.సమత ని అనేక విధాలుగా చాలా కాలం నుండి తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి కారకులైన బెల్లం వేణు ని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ పెట్టి అరెస్టు చేయాలని ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒకవేళ అరెస్టు చేయకుంటే దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పరామర్శించే సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనై తన బాధను వ్యక్తపరిచారు.ఈ తరహా దాడులు పునరావృత్తం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే నని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కేవి కృష్ణారావు కన్వీనర్ గుంతేటి వీరభద్రం కో కన్వీనర్స్ బానోత్ బద్రు నాయక్ లిక్కి కృష్ణారావు యాదవ్ ఆర్పిఐ నాయకులు సంజీవరావు మాల మహానాడు నాయకుడు దాసరి శ్రీనివాస్ కాకుమాని రామారావు ఐక్యవేదిక నాయకులు నజీమా దొడ్డ శ్రీనివాసరెడ్డి మస్తాన్ రవీందర్ నాయక్ ఉపేంద్ర నాయక్ రమ్య పింగిలి రమ్య గుండెపోగు అఖిల్ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking