హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక… ఉర్సు

ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకలు

ఘనంగా హజరత్ కాజా గరీబున్ నవాజ్ ఉరుసు.

కోదాడ టౌన్, అక్షిత న్యూస్:

ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకలు అని వివిధ పార్టీలకు చెందిన నాయకులు పేర్కొన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో గల ప్రసిద్ధిగాంచిన హజరత్ ఖాజా గరీబున్ నవాజ్ 73వ ఉరుసు  ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. మొదటిరోజు ఉత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో వచ్చిన భక్తుల నడుమ అన్ని పార్టీలకు చెందిన నాయకులు గంధమును శిరసున ధరించి మేళతాళాలతో  ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకువచ్చారు. అనంతరం దర్గా వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని ఇటువంటి ఉత్సవాలు   ప్రజల్లో ఐకమత్యాన్ని చాటి చెపుతాయని  అన్నారు.  హజరత్ ఖాజా గరీబున్ నవాజ్ దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ సర్పంచ్ పారా సీతయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, షేక్ మదర్, కర్రీ సుబ్బారావు,  గ్రంథాలయ చైర్మన్ రహీం,బిజెపి నాయకులు నకిరేకంటి  జగన్, పాలూరి సత్యనారాయణ, ఎమ్మెస్పీ నాయకులు ఏపూరి రాజు, దర్గా ముజావర్ కాజా, కమిటీ సభ్యులు బాజాన్,హమీర్, సోహెల్, రఫీ, కాజా బాయ్, బచ్చు అశోక్, హమీద్  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking