
ఎఫ్ ఎన్ సిసి మీడియా కమిటీ చైర్మన్ గా కే. సత్యనారాయణ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సిసి) మీడియా కమిటీ చైర్మన్ గా కే సత్యనారాయణ నియమితులయ్యారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడుగా ఉన్న సత్యనారాయణ ఫిలింనగర్ క్లబ్ మీడియా, వెబ్ సైట్, న్యూస్ లెటర్, సబ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎఫ్ ఎన్ సి సి అధ్యక్ష, కార్యదర్శులు ఘట్టమనేని శేషగిరిరావు, ముళ్ళపూడి మోహన్ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో ఈ విషయం ప్రకటించారు.